టాలీవుడ్‌లో మళ్లీ మొదటికొచ్చిన పర్సంటేజీ వివాదం!
- ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమావేశం
- సుదీర్ఘంగా సాగిన చర్చల్లో కుదరని ఏకాభిప్రాయం
- పెద్ది సినిమాకు పర్సంటేజీ విధానమే కోరుతున్న ఎగ్జిబిటర్లు
టాలీవుడ్‌లో పర్సంటెంజీ వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు సమావేశమై సమస్యను పరిష్కరించుకోనున్నట్లు తెలిపారు. కానీ రామ్ చరణ్ హీరోగా వచ్చే నెలలో విడుదల కానున్న 'పెద్ది' సినిమాకు సింగిల్ థియేటర్లలో పర్సంటేజీ విధానం కావాల్సిందేనని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు.
ఈరోజు హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు మరోసారి అత్యవసరంగా సమావేశమయ్యారు. సుదీర్ఘంగా సాగిన ఈ చర్యల్లో ఎటువంటి ఏకాభిప్రాయం రాలేదు. వారి మధ్య సయోధ్య కుదరలేదు. పెద్ది సినిమాకు తమకు కచ్చితంగా పర్సంటేజ్ కావాలని ఎగ్జిబిటర్లు పట్టుబడుతున్నారు. పర్సంటేజ్ కొద్దిగా తక్కువగా ఇచ్చినా పర్వాలేదని, కానీ రెంట్ మాత్రమే ఇస్తామంటే కుదరదని స్పష్టం చేశారు.